ETV Bharat / city

పది రోజులుగా అందని ప్రయాణ భత్యం.. కొవిడ్‌ బాధితుల నిరాశ - కొవిడ్ బాధితులకు అందని ప్రయాణ ఛార్జీల వార్తలు

కరోనా సోకిందని తెలియగానే బాధితుడి ఇంటికి అంబులెన్స్‌ వెళ్లి ఆసుపత్రికి తీసుకొచ్చి... కోలుకున్న తర్వాత అందులోనే ఇంటికి పంపేవారు. బాధితుల సంఖ్య పెరగటంతో అంబులెన్స్‌లో తీసుకెళ్లడం సాధ్యం కాక ప్రయాణ ఖర్చుల కింద రూ.2 వేలు అందజేస్తున్నారు. దాంతో ఆటో, ట్యాక్సీల్లో ఇల్లు చేరి మరో వారం రోజులు హోం ఐసోలేషన్‌లో గడిపేవారు. ఈ నెల ప్రారంభం నుంచి బడ్జెట్‌ అందక రూ. 2 వేలు నిలిపివేశారు.

transport money not given to covid patients in ap
కొవిడ్ బాధితులకు పది రోజులుగా అందని ప్రయాణ భత్యం
author img

By

Published : Aug 15, 2020, 7:57 AM IST

రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రి (స్విమ్స్‌) నుంచి ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వేల రూపాయలు చెల్లిస్తేనే అంబులెన్స్‌లు రాని పరిస్థితి. డిశ్ఛార్జి అవుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి డబ్బు తెప్పించుకుని వెళుతున్నారు. నగదు బదిలీ లావాదేవీలు తెలియనివారు మరింతగా ఇబ్బందిపడుతున్నారు. ఇక ఇతర జిల్లాలకు చెందిన వారి పరిస్థితి అంతే. కొవిడ్‌ ఆస్పత్రులు.. సెంటర్ల నుంచి బాధితుడిని ఇంటికి తీసుకెళ్లాలంటే అత్యధికంగా నగదు డిమాండ్‌ చేస్తున్నారు. ఆటోవాలాలు అడిగిన ఛార్జీ చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కడప జిల్లాకు రూ. 5 వేల వరకు అంబులెన్స్‌ల యజమానులు వసూలు చేస్తున్నాయి. జిల్లాలోని గ్రామాలకు వెళ్లాలన్నా.. నగరంలోని పలు వీధుల్లోకి ఆటోలో వెళ్లాలన్నా రూ.వందలు ఇవ్వాల్సిందే.

* తిరుపతి రాములవారి వీధికి చెందిన ఓ వ్యక్తి(55) అనారోగ్యంతో గతనెల 24వ తేదీ రుయాలో చేరగా.. కరోనా లక్షణాలు ఉన్నాయని జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి- 2(రుయా)కి మార్చారు. ఈనెల 3వ తేదీ డిశ్ఛార్జి చేశారు. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రూ.2 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని పాసుబుక్‌ మొదటి పేజీ నకలు తీసుకున్నారు. ఇప్పటివరకు నగదు జమ కాలేదు.

ఈయనొక్కరే కాదు.. జిల్లాలో రోజూ వందల సంఖ్యలో బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుతున్నా వారికి నగదు అందడం లేదు. కరోనాను జయించి ఇంటికి వెళ్లే బాధితులకు ప్రభుత్వం తరఫున నగదు అందడం లేదు. పది రోజుల నుంచి నగదు పంపిణీ నిలిపివేశారు. బాధితులు ఇళ్లు చేరేందుకు ప్రయాణ ఖర్చులకు ఇబ్బందిపడుతున్నారు.

మంజూరయ్యాక జమ చేస్తారంట

కొవిడ్‌ బాధితుల ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఇచ్చే రూ.రెండు వేలు బడ్జెట్‌ రాలేదు. డబ్బు వచ్చాక మీ అకౌంట్‌కు జమ చేస్తామని.. వెళ్లేవాళ్లు వెళ్లవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. డబ్బు కోసం ఉండలేక బాధితులు వెళ్లిపోతున్నారు. అలా వెళ్లేవారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అప్పటికప్పుడు వారి వద్ద బ్యాంకు పుస్తకం నకలు కాపీ ఉండదు కాబట్టి వెళ్లిపోతున్నారు. తర్వాత తెచ్చి ఎవరికి.. ఎక్కడ ఇవ్వాలనే విషయం తెలియని పరిస్థితి. తరువాతైనా వారి ఖాతాకు జమ అవుతుందనే నమ్మకం లేదు.

రావాల్సిన సొమ్ము రూ.అరకోటి పైనే..

రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రి(స్విమ్స్‌), జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి - 2(రుయా), శ్రీనివాసం కొవిడ్‌ సెంటర్‌ నుంచి గత పది రోజులుగా సుమారు 2261 మంది డిశ్ఛార్జి అయ్యారు. వీరికి సుమారు రూ.45.22 లక్షలు చెల్లించాల్సి ఉంది. వీరు కాకుండా తిరుపతి పద్మావతి కొవిడ్‌ సెంటర్‌, జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి(చిత్తూరు) నుంచి డిశ్ఛార్జి అవుతున్నారు. వారికి కూడా రూ.లక్షల్లో చెల్లించాల్సిఉంది.

ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రాలేదు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రానందున కొవిడ్‌ బాధితులకు రూ.రెండు వేలు ఇవ్వడం లేదు. వారం రోజుల నుంచి నగదు ఇవ్వలేదు. ఆస్పత్రులు.. సెంటర్ల నుంచి రోజు వారీగా ఇండెంట్‌ వస్తే ఎంత మందికి ఇవ్వాలనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. బాధితుల నుంచి బ్యాంకు అకౌంట్‌ నెంబర్లు సేకరిస్తున్నాం. బడ్జెట్‌ రాగానే జమ చేస్తాం. - వెంకటరమణ, తహసీల్దారు, తిరుపతి అర్బన్‌

ఇవీ చదవండి....

తోటి కోడళ్ల గొడవ.. ఏపీ, తమిళనాడులోని రెండు గ్రామాల వివాదమైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.