ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 9AM - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM
author img

By

Published : Nov 19, 2021, 9:04 AM IST

  • RAINS: కనుమదారుల్లో విరిగిపడిన కొండచరియలు.. చెరువులా శ్రీవారి ఆలయం
    కుండపోత వర్షంతో తిరుమల ఆలయ పరిసరాలు నీట మునిగాయి. కనుమదారుల్లో వరద నీరు జలపాతాలను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికే కొండపైన ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • RAINS IN TIRUPATI: తిరుపతిని ముంచెత్తిన వరద... నీటిలోనే జనం జాగారం
    భారీ వర్షాలకు తిరుపతి అతలాకుతలమైంది. శేషాచల కొండలపై నుంచి వస్తున్న వరద నీటితో నగరం నీట మునిగింది. ఎటుచూసినా నీటితో... చెరువును తలపిస్తోంది. వరద నీరు పెద్దఎత్తున రహహదారులను ముంచెత్తింది. కార్లు, ద్విచక్ర వాహనాలు... కొట్టుకుపోయాయి. చరిత్రలో ఎప్పుడూ చూడనంత వరద నీరు తిరుపతి వీధుల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • WEATHER UPDATE: పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు
    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు(heavy rains) కురిసే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • KARTHIKA POURNAMI : ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు...ఆలయాల్లో భక్తుల రద్దీ
    రాష్ట్రవ్యాప్తంగా కార్తిక పౌర్ణమి(Karthika pournami celebratiions) వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే ఆలయాలకు తరలివచ్చిన మహిళలు, భక్తులు దీపాలు వెలిగించి, పూజలు చేశారు. భక్తుల జయజయధ్వానాల మధ్య ఆలయాలు పండుగశోభను సంతరించుకున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పాక్ 'దౌత్యసాయం' బిల్లులో లోపాలు: భారత్​
    భారత నౌకాదళ మాజీ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ మరణశిక్ష అప్పీలు చేసుకునే విషయంలో పాకిస్థాన్ ఇటీవల​ తీసుకొచ్చిన బిల్లుపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ బిల్లులో లోపాలు ఉన్నాయన్నారు. జాదవ్​కు దౌత్యసాయం అందించే విషయంలో మోకాలడ్డుతోందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Azadi ka amrit mahotsav: గాంధీకి ముందే సైంటిస్ట్‌ సత్యాగ్రహ
    సత్యాగ్రహ ఉద్యమం (Satyagraha andolan) గాంధీజీతోనే మొదలైనా.. అలాంటి నిరసన బలాన్ని బ్రిటిష్‌వారికి అంతకు ముందే రుచి చూపించారో శాస్త్రవేత్త! తెల్లవారి జాతివివక్షను అహింసాయుతంగా ఎదుర్కొని విజయం (Azadi ka amrit mahotsav) సాధించారు జగదీశ్‌ చంద్రబోస్‌! పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారత్‌పై అమెరికా కాట్సా అస్త్రం..!
    రష్యా నుంచి ఎస్​-400 ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేసినందుకు భారత్​పై ఆంక్షలు విధించే అంశంపై పరిశీలిస్తోంది అమెరికా. అయితే.. తమ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నందుకు భారత్​పై కొరడా ఝళిపించాల్సిందేనని కొందరు అమెరికన్లు చెబుతుండాగ.. వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్‌కు మినహాయింపు ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సృజన, నైపుణ్యాల కలబోతతో.. 'గేమింగ్' ఉజ్జ్వల భవిత!
    చలనచిత్ర పరిశ్రమతోపాటు వెబ్‌సైట్లు, యాప్‌ల రూపకల్పన, గేమింగ్‌ తదితర విభాగాలకూ వీఎఫ్‌ఎక్స్‌ సేవలు అవసరం. ఆత్మనిర్భరత లక్ష్యసాధన కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన 'భారత్‌లో తయారీ', 'డిజిటల్‌ ఇండియా' కార్యక్రమాలు భారత్‌లో వీఎఫ్‌ఎక్స్‌ రంగం వృద్ధికి గొప్ప ఊతమిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ISL 2021-22: నేటి నుంచే ఐఎస్‌ఎల్‌
    ఇండియన్ సూపర్​ లీగ్(ISL 2021-22) ఫుట్​బాల్​ శుక్రవారం(నవంబర్ 19) నుంచే ప్రారంభం కానుంది. ఏటీకే మోహన్‌ బగాన్‌, కేరళ బ్లాస్టర్స్‌ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ఎన్టీఆర్!
    బాబాయ్ బాలయ్య 'అఖండ'(akhanda release date) కోసం అబ్బాయ్ ఎన్టీఆర్(ntr movies) అతిథిగా రానున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉన్నప్పటికీ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.