శ్రీవారి దర్శనార్థం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డిలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి:
YADADRI: స్వర్ణ వర్ణ శోభితమయం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం