ETV Bharat / city

ఎమ్మెల్యే భూమనకు మళ్లీ కరోనా.. చెన్నైలో చికిత్స

author img

By

Published : Oct 8, 2020, 7:59 PM IST

వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన... కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

tirupati mla bhumana karunakar reddy
tirupati mla bhumana karunakar reddy

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి రెండోసారి కరోనా బారిన పడ్డారు. లక్షణాలు తీవ్రంగా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన... తిరుపతిలోని ఓ ప్రయివేట్ ల్యాబ్​లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో మరోసారి తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్షలు చేశారు. ఇందులో కూడా పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో రుయా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని భావించారు. అయితే తీవ్రమైన జ్వరం, దగ్గు, మధుమేహం, అధికరక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతుండటంతో మెరుగైన వైద్య అవసరమైన దృష్ట్యా... చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు.

రెండు నెలల క్రితం....

కరుణాకరరెడ్డి రెండు నెలల క్రితం తొలిసారిగా కరోనా బారిన పడ్డారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలను చైతన్యపరిచే క్రమంలో నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు కరోనా పరీక్షలు తరచూ చేయించుకొనేవారు. ఈ క్రమంలో లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ గా ఫలితాలు వచ్చాయి. దీంతో ఆగష్టు 25 న చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరారు. పది రోజులపాటు చికిత్స పొందిన అనంతరం సెప్టంబర్ 3 న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదీ చదవండి

న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారా..? : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.