లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత తిరుపతిలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. 60 ఏళ్లకు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అందరికీ కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. గడచిన రెండు రోజుల్లోనే నగరంలో 30 పాజిటివ్ కేసులు తేలాయని వెల్లడించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ....తమ కార్యకలాపాలను నిర్వహించాలని కోరిన కమిషనర్.....కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతోన్న నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.
ఇదీ చదవండి: 'సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం'