ETV Bharat / city

తల్లి చెంతకు కుమార్తె.. రష్యన్​ మహిళ కథ సుఖాంతం

లాక్​డౌన్​తో తల్లి ఓ చోట, కుమార్తె ఓ చోట చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న రష్యన్ మహిళ ఏస్తర్‌ కథ సుఖాంతమైంది. ఉత్తరప్రదేశ్​లోని బృందావన్ నుంచి తల్లి ఓలివియా తిరుపతి చేరుకున్నారు. ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న ఏస్తర్​పై ఈటీవీ-ఈనాడులో ప్రసారమైన కథనాలతో పలువురు స్పందించారు.

tirupathi-commsissioner-fund-handover-to-russian-lady

author img

By

Published : Jul 30, 2020, 5:49 PM IST

Updated : Jul 30, 2020, 8:47 PM IST

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి.. కరోనా లాక్​డౌన్ కారణంగా తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతి ఎస్తేర్​పై ఈనాడు- ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందన వెల్లువెత్తింది. ఆమెను ఆదుకునేందుకు మానవత్వంతో పలువురు స్పందించారు. కొందరు ఆర్థిక సాయం చేయగా... మరి కొంతమంది యూపీలోని బృందావన్​లో ఉన్న ఏస్తర్‌ తల్లి తిరుపతి రావడానికి అవసరమైన విమాన ఖర్చులు సమకూర్చారు. ఈ క్రమంలో గడిచిన కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న తల్లీకుమార్తెలు ఒక చోటికి చేరారు. ఈటీవీలో కథనాలు ప్రసారమవడం వల్ల తమ సమస్యలు తీరాయని ఏస్తర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తల్లిని చూడగానే ఉద్వేగానికి లోనయ్యారు.

ఈనాడు-ఈటీవీ కథనాలతో.. రష్యన్ యువతికి పలువురు అండగా నిలబడ్డారు. రూ.78,500 విరాళాన్ని... తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా చేతుల మీదుగా ఈనాడు యాజమాన్యం ఎస్తేర్​కు అందచేసింది. ఆమెకు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందింది. ఎస్తేర్ పడుతున్న కష్టాలపై ఈనాడు-ఈటీవీ కథనాలు వెలుగులోకి తీసుకువచ్చాయన్న కమిషనర్.... .ఆమె తన తల్లితో రష్యాకు తిరిగి వెళ్లేంతవరకూ నగరపాలక సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తన కష్టాలపై స్పందించి... విరాళాలు పంపిన వారందరికీ ఎస్తేర్ కృతజ్ఞతలు తెలిపారు.

తల్లి చెంతకు కుమార్తె.. రష్యన్​ మహిళ కథ సుఖాంతం

సంబంధిత కథనం : తిరుపతిలో రష్యన్ మహిళ కష్టాలు.. ఆర్థిక సమస్యలతో తల్లీకుమార్తెలు అవస్థ

Last Updated : Jul 30, 2020, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.