తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల (tirumala-sarvadarshan-tokens) సంఖ్యను పెంచారు తితిదే అధికారులు. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున టోకెన్లు జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాల వారికి టోకెన్లు జారీ చేయనున్నారు. నేటి నుంచి ఏకాంతసేవ రాత్రి 12 గంటలకు నిర్వహించనున్నారు. రాత్రి 12 గంటల వరకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.
ప్రత్యేక పోర్టల్..!
శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా విడుదల చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం తితిదే వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను తీసుకువచ్చింది. ఇప్పటివరకు కరెంట్ బుకింగ్ ద్వారానే ఉచిత టోకెన్లను జారీ చేసిన తితిదే.. కరోనాతో భక్తులు గుమికూడే పరిస్థితి రానివ్వకుండా ఉండేందుకు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ప్రస్తుతం సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. త్వరలో ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్ల జారీ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. దీని ద్వారా ఆర్జితసేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల మాదిరిగా భక్తులు ఉచిత దర్శన టోకెన్లను కూడా ముందుగానే నమోదు చేసుకునే అవకాశం ఉండనుంది.
ఇదీ చదవండి
VIZAG STEEL: త్వరలోనే ఉక్కు పోరాటంలోకి పవన్ కల్యాణ్: నాదెండ్ల మనోహర్