తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులుతీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు 5 గంటలు వేచిఉండాల్సి వస్తోంది. నిన్న 90 వేల 25 మంది శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3 కోట్ల 23 లక్షలు.
ఇవీ చదవండి.. శ్రీవారి సేవలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్