రెండు రోజుల క్రితం తిరుమల ఆలయం ఎదుట కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ తల్లిదండ్రులు తిరుమల విజిలెన్స్ అధికారులకు బాలుడిని అప్పగించారు. తమ కుమార్తె పవిత్రకు మతిస్థిమితం లేదని... అందుకే బాలుడిని తీసుకెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్‌లో చిన్నారిని క్షేమంగా ఉంచారు. తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
మే 3న బాలుడిని ఎత్తుకెళ్లిన నిందితురాలు పవిత్ర మైసూర్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లింది. ఎందుకు తీసుకొచ్చావని వారు ప్రశ్నించారు. అనంతరం తిరుమల పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: అమానుషం.. 108 వాహనం రాక... బైక్ పైనే..