తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఏడోరోజు.. స్వామివారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు... సర్వాలంకార భూషితుడై సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. శంఖు, చక్రం, గధ, అభయహస్తం ధరించి చతుర్భుజ కేశవమూర్తి అవతారంలో భక్తులను కటాక్షించారు. నూతన వాహనాన్ని తరలించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో పాత వెండి సూర్యప్రభవాహనంపై సేవను నిర్వహించారు. రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవలో శ్రీకృష్ణుడి అవతారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం.. 9 గంటల నుంచి 10 గంటల వరకు అమ్మవార్లతో కలిసి సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. రాత్రి ఏడు నుంచి 8 గంటల వరకు అశ్వవాహనసేవను నిర్వహించడంతో వాహనసేవలు ముగుస్తాయి. రేపు ఉదయం చక్రస్నాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. దీనికోసం ' అయిన మహల్' లో తొట్టె నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వేడుకగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు స్వామివారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలపై దర్శనమిచ్చారు. శనివారం నిర్వహించే సర్వభూపాల, అశ్వ వాహన సేవలతో వాహన సేవలు ముగియనున్నాయి. రేపు ఉదయం శ్రీవారి ఆలయంలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.