చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకూ ఉద్ధృతమవుతోంది. ఆదివారం జిల్లాలో 934 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బాధితుల సంఖ్య 29వేల 830కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 328కి చేరింది.
అత్యధికంగా తిరుపతి నగరంలోనే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్న కారణంగా.. నగరపాలక సంస్ధ అధికారులు ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతిచ్చారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 19వేల 503 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా ....9వేల 999 మంది చికిత్స పొందుతున్నారు. శ్రీకాళహస్తి, మదనపల్లె, నగరి, పుత్తూరు పట్టణాలతో పాటు చిత్తూరు నగరంలో లాక్ డౌన్ కొనసాగుతోంది.
ఇవీ చదవండి: