తిరుపతి ఐఐటీలో టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కె.ఎన్.సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ది నేషనల్ మిషన్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్(ఎన్‌ఎమ్-ఐసీపీఎస్), భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్‌టీ) సంయుక్తంగా తిరుపతి ఐఐటీని ఎంపిక చేశాయని చెప్పారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ముఖ్యంగా పొజిషనింగ్ అండ్ ప్రిసిషన్ అనే అంశాలపై దృష్టిసారిస్తుందన్నారు. ఈ సాంకేతికతతో వ్యవసాయం, నావిగేషన్, టైమింగ్, సెన్సింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, నీటి నిర్వహణ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ తదితర అంశాలపై కచ్చితమైన సమాచార వ్యవస్థ కోసం అప్లికేషన్స్ రూపొందించవచ్చని వివరించారు. ఐదేళ్ల కాలానికి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ నిర్వహణ కోసం డీఎస్‌టీ రూ.100 కోట్లను ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాజధానిని నిర్ణయించుకునేది రాష్ట్రమే: కేంద్రం