ETV Bharat / city

'కుటీర పరిశ్రమ తరహాలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల తయారీ' - తిరుపతిలో పనబాక లక్ష్మి మీడియా సమావేశం

తిరుపతిలోని తెదెపా కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఉపఎన్నికల్లో పలు చోట్ల నకిలీ ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు. తిరిగి పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

panabaka lakshmi press meet in tirupati, panabaka lakshmi on tirupati bi elections
తిరుపతిలో పనబాక లక్ష్మి మీడియా సమావేశం, తిరుపతి ఉపఎన్నికపై పనబాక లక్ష్మి వ్యాఖ్యలు
author img

By

Published : Apr 17, 2021, 10:51 PM IST

తిరుపతి, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఓజిలి మండలంలో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి డిమాండ్ చేశారు. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తిరుపతి ఉపఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయా అని ప్రశ్నించారు. పాఠశాలకు వెళ్లే పిల్లలు సైతం ఓట్లేయటం ఈ ఎన్నికల ప్రత్యేకమన్నారు.

ఇదీ చదవండి: 'కుంభమేళా'పై జునా అఖాడా కీలక నిర్ణయం

కుటీర పరిశ్రమ తరహాలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు తయారు చేశారని లక్ష్మి ఆరోపించారు. నకిలీ ఓటర్లను నిరోధించేందుకు యత్నించిన తెదేపా ఏజంట్లపై తప్పుడు కేసులు పెట్టారని ఆక్షేపించారు. జరిగిన అక్రమాలను పరిశీలించి అవకతవకలు జరిగిన చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

దొంగ ఓట్ల వ్యవహారాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్తాం: రత్నప్రభ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.