సొంత నియోజకవర్గంలో మహిళపై హత్యాచారం జరిగితే సీఎం వైఎస్ జగన్ ఎందుకు స్పందించటం లేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. తిరుపతి కపిలతీర్థంలోని తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె.... రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు.
పులివెందులలో మహిళపై జరిగిన దారుణానికి ప్రతిగా ఈ నెల 19న చలో పులివెందుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున మహిళలు తరలిరావాలని కోరారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ఆమె కోసం తెదేపా తరపున పోరాడాతమని అనిత స్పష్టం చేశారు.
ఇదీ సంగతి : తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు