ETV Bharat / city

LATHI CHARGE : విజయవాణి కళాశాల వద్ద ఉద్రిక్తత...తెదేపా నేతలపై లాఠీఛార్జ్

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో(kuppam municipality elections) ఉద్రిక్తత నెలకొంది. దొంగఓట్లు వేసేందుకు స్థానికేతరులు వచ్చారని తెదేపా నేతలు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్(police lathi charge on TDP leaders) చేశారు.

విజయవాణి కళాశాల వద్ద ఉద్రిక్తత
విజయవాణి కళాశాల వద్ద ఉద్రిక్తత
author img

By

Published : Nov 15, 2021, 4:22 PM IST

Updated : Nov 15, 2021, 4:51 PM IST

కుప్పంలో తెదేపా నేతలపై లాఠీచార్జ్

కుప్పంలోని విజయవాణి కళాశాల(Vijayawani college in Kuppam) వద్ద ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు(Fake votes) వేయించేందుకు స్థానికేతరులను వైకాపా నేతలు తీసుకువచ్చారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాణి పాఠశాలలో బస చేసిన స్థానికేతరులను కుప్పం తెదేపా మహిళా నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు.. ఎందుకొచ్చారని ప్రశ్నించారు. తెదేపా నేతల నిలదీతతో స్థానికేతరులు ముఖాలు దాచుకున్నారు.

దొంగఓట్లు వేసేందుకు వచ్చిన స్థానికేతరులను అరెస్టు చేయాలని విజయవాణి కళాశాల వద్ద తెదేపా నేతలు ఆందోళన(TDP leaders protest at vijayawani college in kuppam) చేశారు. వీరిపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో ఓ కార్యకర్త స్పృహ కోల్పోయాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

మాజీ ఎమ్మెల్సీ అరెస్టు...

మునిసిపాలిటీ ఎన్నికల్లో దొంగఓట్లను ఆపాలంటూ తెదేపా నేతలు చేసిన ఆందోళనలో...మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు అరెస్టు అయ్యారు. శ్రీనివాసులు అరెస్టుపై పోలీసులను నిలదీసిన తెదేపా శ్రేణులపై లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులకు, తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట..

కుప్పం వస్తున్న మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, తెదేపా నేత పులివర్తి నానిని పోలీసులు ఆపేశారు. వారిని వ్యానులోకి ఎక్కించేందుకు యత్నించగా... తెలుగుదేశం కార్యకర్తలు(tdp activist ) అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కుప్పం ఎన్నికల్లో వైకాపా ఓడితే జగన్‌ సీఎం పదవి పోతుందా అని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ఆగ్రహించారు. మెప్మా, వెలుగు, ఇతర ఉద్యోగులకు ఇంకా కుప్పంలో పనేంటని ధ్వజమెత్తారు.అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం.. అనైతికం, అప్రజాస్వామికమంపురపాలక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదలి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకొని వేధించడం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu on police over action at kuppam) ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో నోట్ల కట్టలు పంచుతూ పట్టుబడ్డ వైకాపా నేతల(ycp)ను అదుపులోకి తీసుకోకుండా తెలుగుదేశం శ్రేణులను పోలీసులు బెదిరించడం అనైతికం, అప్రజాస్వామికమని చంద్రబాబు( chandrababu fire on ycp activities at kuppam municipality ) ధ్వజమెత్తారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారిని అడ్డుకోవడంపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

నివేదిక పంపండి

కుప్పంలో వాలంటీర్ల దుర్వినియోగం, బోగస్‌ ఓట్ల కోసం బయటి వ్యక్తుల సమీకరణ, ఓటర్లకు డబ్బు పంపిణీ తదితర అంశాలపై తెలుగుదేశం ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. కుప్పంలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక వార్డులన్నింటిలో అదనపు పోలీసు బలగాలు మోహరించాలని చిత్తూరు జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్​కు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ స్టేషన్‌లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లైవ్ వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ రికార్డింగ్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అవసరమైన చర్యలు తీసుకుని ఎస్​ఈసీ(sec on Clashes between tdp and ycp activists at kuppam)కి నివేదిక పంపాలని ఆదేశించారు.

ఇవీచదవండి.

Last Updated : Nov 15, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.