తిరుమలకు వెళ్లే భక్తులు ఓటర్ ఐడీలు, స్లిప్పులు ఎందుకు తీసుకెళ్తారని యనమల రామకృష్ణుడు నిలదీశారు. నిజమైన భక్తులను తెదేపా శ్రేణులు అడ్డుకుంటే వారి వద్ద చికెన్ బిర్యానీ పొట్లాలెందుకుంటాయని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే వివిధ రకాల కుట్రలకు తెరలేపారని యనమల విమర్శించారు.
'ఇసుక, లిక్కర్ దందాల తరహాలో వైకాపా నేతలు ఓటర్ల దందాకు తెరతీశారు. తిరుపతి పార్లమెంట్లో అసలు ఓట్లు 10 వేస్తే.. దొంగ ఓట్లు 40 వేసి ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఉరికంబం ఎక్కించింది. తిరుపతిలో వైకాపా అరాచకాన్ని దేశమంతా చూసింది. దొంగ ఓట్లు సృష్టించి నిజమైన ఓటర్ల గొంతు నొక్కారు. మంత్రులు మీడియా ముందు నిస్సిగ్గుగా అసత్యాలు చెప్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమవడం బాధాకరం. రాష్ట్రంలో బిహార్ పాలనను అమలు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని ఆధారాలను చూపేందుకు తెదేపా సిద్ధం అని యనమల ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ.. దండెత్తిన దొంగ ఓటర్లు..!
నైతికంగా ఓటమి ఖాయమని గ్రహించే దొంగ ఓటర్లను దింపారు: అశోక్ బాబు
తిరుపతి ఉపఎన్నికలో రాజకీయంగా, నైతికంగా ఓటమి ఖాయమైందని గ్రహించే వైకాపా నేతలు దొంగ ఓటర్లను దింపారని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. 'ప్రజలు తమవైపు లేరని మంత్రులకు అర్థమవటంతో దొంగ ఓట్లను నమ్ముకున్నారు. తిరుమల భక్తులెవ్వరూ ఓటరు స్లిప్పులతో రారని సజ్జల గ్రహించాలి. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్దంగా ఖూనీ చేసినందుకే తిరుపతి ఉపఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి.' అని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తిరుపతి ఉపఎన్నికలో అవకతవకలపై సీఈసీకి తెదేపా ఎంపీల ఫిర్యాదు
డీజీపీ స్వామి భక్తి చాటుకున్నారు: జవహర్
తిరుపతి ఉపఎన్నికలో డీజీపీ స్వామి భక్తి చాటుకున్నారని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. 'గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకున్నట్లుగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. అర్ధసత్యంతో తనను తాను మోసం చేసుకుంటూ 250 బస్సులు వెనక్కి పంపామమని వెల్లడించారు. జగన్ను మెప్పించేందుకు తిరుపతి ఎన్నిక సవాంగ్ పనితీరుకు ఓ అవకాశంగా మారింది.' అని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ.. దండెత్తిన దొంగ ఓటర్లు..!