తిరుపతి ఉపఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రభుత్వ అధికారులు ప్రకటించడంపై తెదేపా తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ తిరుపతిలో స్పందించారు. నిన్న జరిగిన పోలింగ్‌లో చెవులకు వినిపించేటట్లు.. అందరి కళ్లకు కనిపించే విధంగా అక్రమాలు జరిగినా.. అంతా సజావుగా జరిగిందనడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఎస్పీ కార్యాలయం ఎదుటే దొంగ ఓట్లు వేసేందుకు జనాన్ని తరలిస్తున్న బస్సును 30 నిమిషాల పాటు నిలిపినా పోలీసులు స్పందించకపోవడంపై ఆయన మండిపడ్డారు. రిగ్గింగ్‌కు పాల్పడిన వారిని, నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: