Srilanka PM Tirumala Visit : తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు శ్రీలంక ప్రధాని రాజపక్సే, కుటుంబంతో సహా వచ్చిన ఆయనకు.. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఘన స్వాగంతం పలికారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం ఏర్పాట్లు చేశారు.
అనంతరం శ్రీలంక ప్రధాని రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్ లోని శ్రీకృష్ణ అతిథి గృహానికి రాజపక్సే చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న శ్రీలంక ప్రధాని.. రేపు ఉదయం స్వామివారి సేవలో పాల్గొంటారు.
ఇదీ చదవండి : CJI NV RAMANA TOUR: ఈనెల 24 నుంచి స్వరాష్ట్రంలో పర్యటించున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ