ETV Bharat / city

'అక్రమ మద్యం రవాణా, శానిటైజర్ల విక్రయాలపై ప్రత్యేక నిఘా' - tirupati urban sp latest news

నకిలీ మద్యం, శానిటైజర్లను సేవించి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను నివారించేలా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో శుక్రవారం నలుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారన్న ఆయన... వీరి మృతికి గల కారణాలను పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే నిర్ధారించగలమని స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం రవాణా, నాటుసారా తయారీ, శానిటైజర్ల విక్రయాలపై నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్న ఆయన... ఎస్​ఈబీ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం కలిగేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు సైతం పోలీసులకు సమాచారం అందించి సహకరించాలంటున్న తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి.

Special surveillance on illicit liquor trafficking, sale of sanitizers
తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డితో ముఖాముఖి
author img

By

Published : Aug 8, 2020, 5:09 PM IST

తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డితో ముఖాముఖి

తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డితో ముఖాముఖి

ఇదీ చదవండీ... అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.