త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు భాజపా, జనసేన అభ్యర్ధి పేరును ఖరారు చేస్తామని శ్రీసిటీ పర్యటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. వైకాపా, తెదేపాలకు ఓటు వేయడం వల్ల లాభం ఏమిటి? భాజపా అభ్యర్ధిని గెలిపిస్తే కలిగే ప్రయోజనం ఏమిటనేది ప్రజల ముందు వివరిస్తామన్నారు.
తాము ఎలాంటి హామీ ఇవ్వకుండానే తిరుపతిని స్టార్మ్‌సిటీగా ప్రకటించి రెండు వేల కోట్ల రూపాయల నిధులు అందించామని.. తిరుపతి రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేశామని...విమానాశ్రయం, రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందన్నారు. రాష్ట్రంపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం శ్రద్ధ కనబరుస్తోందని అన్నారు. తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే తాము పని చేస్తున్నామన్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు తమ పార్టీలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని.. ఎవరు తమ పార్టీలో చేరాలనుకున్నా ఆహ్వానిస్తామని సోము వీర్రాజు అన్నారు.
ఇదీ చదవండి: తుంగభద్ర పుష్కరాలు: మూడో రోజు సందడి అంతంతే..!