ETV Bharat / city

ఎస్సైను తక్షణమే సస్పెండ్ చేయాలి: వంగలపూడి అనిత - si attack on women in tirupati news

తిరుపతి ఎమ్మార్​పల్లి పోలీస్ స్టేషన్​లో మహిళపై దాడి చేసిన ఎస్సైపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్న తిరుపతి అర్బన్ ఏఎస్పీ సుప్రజను కలిసి ఆమె మాట్లాడారు.

vangalapudi anitha
vangalapudi anitha
author img

By

Published : Dec 6, 2020, 4:57 PM IST

తిరుపతి ఎమ్మార్ పల్లి పోలీస్ స్టేషన్​లో మహిళపై బెల్ట్​తో దాడి చేసిన ఎస్సైని తక్షణమే సస్పెండ్ చేయాలని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఎమ్మార్​పల్లి స్టేషన్​కు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి వెళ్లారు. ఘటనపై విచారణ చేస్తున్న తిరుపతి అర్బన్ ఏఎస్పీ సుప్రజతో మాట్లాడారు.

ఘటనపై విచారణ జరుపుతున్నామని... ఎస్‌ఐ తప్పు ఉందని తేలితే అతనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఏఎస్పీ సుప్రజ వారికి హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిత... బాధితురాలికి తెలుగు దేశం పార్టీ అండగా నిలబడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ రెండింటి వైఫల్యం ఈ ఘటన ద్వారా రుజువయ్యాయని అనిత మండిపడ్డారు. బాధిత మహిళకు న్యాయం చేసి పోలీసులు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

పోలీస్​స్టేషన్​లో మహిళపై ఎస్సై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.