2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నులు జూన్ 30వ తేదీలోపు చెల్లించిన వారికి ప్రభుత్వం 5 శాతం రాయితీని ప్రకటించింది. రాయితీ పొందేందుకు మంగళవారం ఆఖరి రోజు అయినందున ప్రజలు పన్ను చెల్లించేందుకు క్యూ కట్టారు. తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలోని లలిత కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పన్ను చెల్లింపు కౌంటర్లు కిటకిటలాడాయి.
ఆన్లైన్, చెక్కు రూపంలో పన్ను చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ నగదు రూపంలో చెల్లించేందుకు ఆసక్తి చూపారు. దీంతో సర్వర్లు మొరాయించాయి. సర్వర్లు మొరాయించటంతో చాలామంది నిరాశగా వెనుదిరిగారు. 5 శాతం రాయితీని కోల్పోవాల్సి వచ్చిందంటూ వాపోయారు.
ఇవీ చదవండి...
నేడు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కార్యకలాపాలను ప్రారంభించనున్న సీఎం