తిరుమలలో కొంతకాలంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ జలకళ సంతరించుకున్నాయి. పాపవినాశనం జలాశయం పూర్తిగా నిండటంతో నిన్న సాయంత్రం... మళ్లీ ఇవాళ ఉదయం గేట్లు తెరిచి... దిగువకు నీరు విడుదల చేశారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి జలాశయాన్ని సందర్శించారు. మిగతా జలాశయాలూ త్వరలోనే నిండుతాయని.. ఏడాదికి సరిపడా నీటి నిల్వలున్నాయని ఆయన అన్నారు.
ఇవీ చూడండి-రెండు సంచుల పురాతన నాణేలు బయటపడ్డాయి.. ఎక్కడంటే..