తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, కమిషనర్ గిరీషా శంకుస్థాపన చేశారు. నగరంలోని 19వ వార్డులో ముత్యాలరెడ్డిపల్లి వద్ద రూ.52.50 లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. అనంతరం రాయల్ చెరువు రోడ్డు రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రైల్వే అధికారులతో కలిసి భూమి పూజ చేశారు.
తిరుపతి నగరంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రూ.15.30 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జికి నగరపాలక సంస్థ వాటాగా రూ.7.81 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరు నెలల్లో వంతెన నిర్మాణాలు పూర్తవుతాయని... దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి : బీసీ కార్పొరేషన్లకు ఇంఛార్జ్ అధికారుల నియామకం