తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించి ప్రజలెవ్వరూ బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వారి మాటలు బేఖాతరు చేసి రోడ్లపైకి వచ్చిన ద్విచక్ర వహనదారులపై కేసులు నమోదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగరంలో పర్యటించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎటువంటి విపత్కర పరిస్థితులల్లోనూ ప్రజలు బయటకు రావొద్దంటూ చేతులు జోడించి వేడుకున్నారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చదవండి: