ETV Bharat / city

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా - కమెడీయన్ పృథ్వీ వార్తలు

ఆడియో టేపుల వ్యవహారం సంచలనంగా మారటంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి పృథ్వీరాజ్ వైదొలిగారు. సీఎం జగన్ సిద్ధాంతాలను గౌరవిస్తూ స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తాను ఏ తప్పు చేయలేదని ఇదంతా కొందరి కుట్ర అని పృథ్వీ అన్నారు.

Prithviraj resigns as SVBC chairman
Prithviraj resigns as SVBC chairman
author img

By

Published : Jan 12, 2020, 8:05 PM IST

Updated : Jan 12, 2020, 8:27 PM IST

మీడియా సమావేశంలో పృథ్వీ రాజ్

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్‌ రాజీనామా చేశారు. విచారణలో నిర్దోషిగా తేలిన తర్వాతే మళ్లీ పదవి చేపడతానని పృథ్వీ చెప్పారు. హైదరాబాద్​లోని ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడిన ఆయన... ఫేక్ వాయిస్‌తో ఇంతటి కుట్ర చేస్తారని తాను ఊహించలేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఎస్వీబీసీ ఉద్యోగులతో తనకు ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం సేవించాననేది అవాస్తవమని అన్నారు. మద్యం తాగినట్లు తేలితే చెప్పుతో కొట్టండని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌కు దగ్గరయ్యాననే అక్కసుతోనే తనపై కుట్రలు జరిగాయని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు. అలాగే తుళ్లూరులో ధర్నా చేసే అందరినీ పెయిడ్ ఆర్టిస్టులని తాను అనలేదని పృథ్వీ చెప్పారు. బినామీ ముసుగులో ఉన్న కార్పొరేట్ రైతులను మాత్రమే అన్నానని వివరించారు.

విచారణకు ఆదేశం

మరోవైపు ఆడియో టేపుల వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించారు. టేపులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి పూర్తి స్థాయి విచారణ చేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:

విజిలెన్స్​ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్​

Intro:Body:Conclusion:
Last Updated : Jan 12, 2020, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.