తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిల్లీ నుంచి రాష్ట్రానికి బయల్దేరారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్.. రాష్ట్రపతికి ఉదయం 10.30 గంటలకు స్వాగతం పలికనున్నారు. విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుమల చేరుకుంటారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ స్వామివారిని దర్శించుకోనుండగా.. సీఎం జగన్ మాత్రం రేణిగుంట నుంచే తిరిగి విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు.
ప్రభుత్వ ప్రతినిధులుగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పర్యటనలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి తిరుమల పర్యటన దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకు తిరుపతిలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.
సంబంధిత కథనం: