మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...తనను అంతమెందించడానికి కుట్రపన్నారని చిత్తూరు జిల్లా జడ్జి రామకృష్ణ ఆరోపించారు. అనారోగ్యం దృష్ట్యా తిరుపతి ఆస్పత్రిలో వైద్య చికిత్స కోసం వచ్చిన తనను కొందరు వెంబడించి, తమ కుమారుడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే జనసందోహం ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డట్లు చెప్పారు. తిరుపతి కొర్లగుంట కూడలిలో పోలీసులు తనను అడ్డుకోవడంపై జస్టిస్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రిపై హైకోర్టులో కేసులు వేసిన దగ్గర నుంచి బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయన్న ఆయన....ఇప్పుడు పోలీసుల అండతో తనను చంపడానికి పథకం వేశారని ఆరోపించారు. జడ్జిని పరామర్శించిన తెదేపా నేత నరసింహప్రసాద్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి : ప్రభుత్వ హాస్టళ్లలో స్థితిగతులు పూర్తిగా మార్చాలి: సీఎం జగన్