ETV Bharat / city

భవనంపై నుంచి పడి...తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యోగి మృతి

author img

By

Published : Oct 27, 2020, 9:16 PM IST

Updated : Oct 28, 2020, 3:18 AM IST

పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేయగా...భవనంపై నుంచి పడి తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యోగి మృతి చెందారు. నగరంలోని కొత్త వీధిలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో నగరపాలక సంస్థ హెల్త్ ఇన్​స్పెక్టర్ కృష్ణయ్య(47) భవనం రెండో అంతస్తు నుంచి పడి గాయపడ్డారు. వెంటనే రుయా ఆసుపత్రికి తరలించగా...వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్థరించారు.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి
పేకాట శిబిరంపై పోలీసుల దాడి
మృతుడి బంధువు

పేకాట శిబిరంపై పోలీసుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ప్రభుత్వోద్యోగి మృతి చెందిన ఘటన తిరుపతిలో కలకలం రేపుతోంది. కొత్తవీధిలోని ఓ పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో...నగరపాలక సంస్థ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణయ్య అనే వ్యక్తి మృతిచెందారు. తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి జారిపడ్డారా? రెండో అంతస్తు నుంచి వేరే భవనాన్ని దాటే క్రమంలో పడిపోయారా అని నిర్ధరించవలసి ఉందని డీఎస్పీ బారిక నరసప్ప అన్నారు. కృష్ణయ్య మృతిపై బంధువులు, కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రుయా ఆసుపత్రి మార్చురీ ఎదుట నిరసన చేశారు. భవనంపై నుంచి దూకి మృతిచెందిన వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.41,500 నగదు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

మద్యానికి బానిసైన వ్యక్తి కాల్వలో దూకి ఆత్మహత్య

Last Updated : Oct 28, 2020, 3:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.