ETV Bharat / city

జగన్‌ను ముఖ్యమంత్రిగా గుర్తించను: పవన్​కల్యాణ్​ - పవన్ లెటేస్ట్ న్యూస్

ఓ సామాన్య వ్యక్తి ఆవేదనే జనసేన పార్టీ స్థాపనకు మూలమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్అన్నారు. రాజకీయాల్లో మార్పు కోసమే జనసేన కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్... ప్రజల కష్టాలు చూసి మనసులో బాధపడలేక పార్టీ పెట్టానన్నారు. మంత్రులు బాధ్యత మరిచి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తన మతం మానవత్వం, కులం మాటతప్పని కులమన్న జగన్... ఇతర కులాలు మాటతప్పే కులాలా? జగన్ సమాధానం చెప్పాలని పవన్ ప్రశ్నించారు. జగన్​రెడ్డిని కచ్చితంగా ముఖ్యమంత్రిగా గుర్తించనని పవన్ వ్యాఖ్యానించారు.

pawan kalayan fires on ycp
తిరుపతి న్యాయవాదుల సమావేశంలో పవన్ కల్యాణ్
author img

By

Published : Dec 3, 2019, 5:51 PM IST

Updated : Dec 3, 2019, 7:03 PM IST

తిరుపతి న్యాయవాదుల సమావేశంలో పవన్ కల్యాణ్

చిత్తూరు జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఇవాళ తిరుపతిలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. న్యాయవాదులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. జనసేన పార్టీ స్థాపనకు కారణాలను న్యాయవాదులతో ఆయన పంచుకున్నారు. ఎంతో కష్టమైన సమయంలో జనసేన పార్టీ పెట్టానన్న పవన్‌... ఎన్నో ఎదురుదెబ్బలు ఉంటాయని తెలిసే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే జనసేన కంకణం కట్టుకుందన్నారు. భావితరాల గురించి ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. త్రికరణశుద్ధి ఉన్న న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరారు. కోర్టుల వద్ద న్యాయవాదులకు సరైన మౌలిక వసతులు లేవని పవన్ అన్నారు.

రాయలసీమకు చెడ్డపేరు తెచ్చిందేవరు?
వైకాపా నేతల భాష దారుణంగా ఉందని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. ఏ అంశం గురించి మాట్లాడుతున్నారో అసలు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బాధ్యతగా ఉండాల్సిన వాళ్లే నిత్యం బూతులు మాట్లాడుతున్నారన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా కచ్చితంగా గుర్తించనని పవన్‌ వ్యాఖ్యానించారు. మాటలు రాని చెట్లను నరికేస్తున్న వారిని ఎందుకు గౌరవించాలని పవన్‌ ప్రశ్నించారు. రాయలసీమలో బత్తాయిచెట్లు నరికించడం ఏం మానవత్వమని పవన్‌ అన్నారు.

రాయలసీమ ప్రాంతానికి చెడ్డపేరు ఎవరు తెచ్చారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాయలసీమను కొన్ని గ్రూపులు కబ్జా చేశాయని ఆరోపించారు. జనసేన నిజం మాట్లాడుతుంది కాబట్టే ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని పవన్ స్పష్టం చేశారు.

అమిత్ షా లాంటి వారే వీరికి సరిపోతారు
ప్రజల కష్టాలు చూసి మనసులో బాధపడలేక పార్టీ పెట్టానని పవన్‌ తెలిపారు. సమస్యలపై ఓ సామాన్య వ్యక్తి ఆవేదనే జనసేన పార్టీ అని వ్యాఖ్యానించారు. అమిత్ షా లాంటి వ్యక్తులే ఇప్పటి రాజకీయాలకు సరిపోతారన్న పవన్‌... అమిత్‌ షాలా ఉక్కుపాదంతో అణచివేసే వారికే వీళ్లు భయపడతారన్నారు. తన మతం మానవత్వం, కులం మాటతప్పని కులమని జగన్‌రెడ్డి అంటున్నారన్న జనసేనాని.. అంటే మిగతా కులాలు మాటతప్పే కులాలా? అని నిలదీశారు. చట్టాన్ని కాపాడాల్సినవారే అలా ఉంటే.. దుర్మార్గులు రోడ్లపై అత్యాచారాలు చేయరా అని ప్రశ్నించారు. గొప్ప పాలన అని చెప్పుకుంటున్న వైకాపా... రాయితీ ధరకు ఉల్లినీ ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి :

ఉల్లి ధరలు తగ్గించండి... ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి

Last Updated : Dec 3, 2019, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.