ETV Bharat / city

తితిదేలో వివాదం.. వెబ్​సైట్​లో అన్యమత నినాదం

author img

By

Published : Dec 1, 2019, 11:23 AM IST

తితిదే కొత్తగా రూపొందించిన 2020 క్యాలెండర్ పీడీఎఫ్​ను గూగుల్ నుంచి డౌన్​లోడ్ చేసుకునే సమయంలో అన్యమత నినాదం కనిపించడం వివాదాస్పదమైంది. దీనిపై విచారిస్తున్నామని తితిదే అధికారులు తెలిపారు.

pagon religion contraversy in ttd website
తితిదేలో మరో వివాదం.. వెబ్​సైట్​లో అన్యమత నినాదం

తితిదేలో మరో వివాదం చర్చనీయాంశమైంది. తితిదే కొత్తగా రూపొందించిన 2020 క్యాలెండర్ పీడీఎఫ్​ను గూగుల్ నుంచి డౌన్​లోడ్ చేసుకునే సమయంలో అన్యమత నినాదం కనిపించడం వివాదాస్పదమైంది. దీనిపై భక్తుల నుంచి విమర్శలు రావడం వల్ల అధికారులు శనివారం ఉదయం దీన్ని తొలగించారు. కొత్త క్యాలెండర్ ప్రతిని ఇంకా ఆన్​లైన్​లో తితిదే అందుబాటులోకి తీసుకురాలేదు. 2019 ఏప్రిల్ 6న అప్​లోడ్ అయిన క్యాలెండర్ పీడీఎఫ్ లింక్ కింద ఈ అన్యమత నినాదం కనిపించింది. ఈడీపీ(ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్), టీసీఎస్ సంస్థలు తితిదే వెబ్​సైట్​ను నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై విచారిస్తున్నామని తితిదే అదనపు ముఖ్య విజిలెన్స్ అధికారి శివకుమార్​రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

తిరుచానూరు అమ్మవారికి ప్రభుత్వ పట్టువస్త్రాలు, సారె సమర్పణ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.