తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. వైకాపా గెలిస్తే తెదేపా ఎంపీలు రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా తీవ్రత దృష్ట్యానే సీఎం సభ రద్దు చేసినట్టు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాహిత కార్యక్రమాలే వైకాపాకు బలమని పేర్కొన్నారు. భాజపా, జనసేన, తెదేపా మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న పెద్దిరెడ్డి... పాచిపోయిన లడ్డూ ఇప్పుడు పవన్‌కు తాజాగా ఉందా..? ప్రశ్నించారు. భాజపా రాష్ట్రానికి ఏమీ చేయలేదని... తిరుపతి ఓటర్లు వైకాపాను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. సునీల్ దియోధర్ ఎలాంటి వ్యక్తో మేఘాలయ ప్రజలకు తెలుసని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... సర్వశక్తులూ ఒడ్డుతున్న తెదేపా.. గెలుపుపై వైకాపా ధీమా..!