ఐఐటీలు, ఎన్ఐటీలకు అనుసంధానంగా ప్రతి రాష్ట్రంలో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఐఐటీ తిరుపతి వేదికగా రీసోర్స్ సస్టైనబిలిటీ అంశంపై జరిగిన వెబినార్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఐఐటీల్లో అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు కమిటీలు ఏర్పడాలని సూచించిన గడ్కరీ.. ఐఐటీ నిపుణులు, జాతీయ రహదారుల సంస్థ సభ్యులు, కేంద్ర రహదారులు రవాణా మంత్రిత్వశాఖ అధికారులు కలిసి కమిటీలుగా ఏర్పడాలని చెప్పారు.
రహదారుల నిర్మాణంలో అధునాతన సాంకేతికత వినియోగం కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. రహదారుల నిర్మాణంలో రబ్బరు, ప్లాస్టిక్ వినియోగంపై మరింత లోతుగా పరిశోధనలు జరగాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయం