తిరుపతిలో ఈనెల 18న ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన తల్లి ఆచూకీ లభ్యమైంది. షిర్డీలో తల్లి, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తిరుపతి పోలీసులు గుర్తించారు. గురువారం సాయంత్రానికి తల్లి, పిల్లలను తిరుపతి తీసుకువచ్చే అవకాశం ఉంది.
తిరుపతి కెన్నడీ నగర్‌కు చెందిన శివకుమార్.. తన భార్య శ్రీలేఖతోపాటు ముగ్గురు పిల్లలు దీక్షతశ్రీ, తేజ శ్రీ, కార్తీక్ ఆచూకీ తెలియడం లేదని కొన్ని రోజుల కిందట తిరుపతి తూర్పు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు..నగరంలోని సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు షిర్డీలో ఉన్నట్లు గుర్తించారు.
ఇదీ చదవండి : వైకాపా.. ఒక్క ఛాన్స్‌ను ఆఖరి ఛాన్స్ చేసుకుంది: చంద్రబాబు