తిరుపతిలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగునంగా శ్మశాన వాటికల్ని ఆధునీకరించి అందుబాటులోకి తేనున్నట్లు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని పురాతన హరిశ్చంద్ర శ్మశాన వాటికలో రూ.1.25 కోట్లతో నిర్మించిన దహన వాటికను నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషతో కలిసి ప్రారంభించారు. బాలాజీ కాలనీ శ్మశాన వాటికలో రూ.1.50 కోట్ల తుడా నిధులతో నిర్మించనున్న ఆధునాతన దహన వాటికకు భూమి పూజ చేశారు.
దహన వాటికల కొరతతో పదుల సంఖ్యలో కరోనా మృతులను ఆలస్యంగా దహనం చేయాల్సి వచ్చిందని...అందుకే వాటిని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే కరకంబాడి రోడ్డులో ఆధునాతన దహనవాటిక సేవలందిస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో మరో కొత్తది నిర్మించి... తిరుపతి నగరంలోని అన్ని ప్రాంతాలలో శ్మశానవాటికలు అందుబాటులో వచ్చేలా చేస్తామన్నారు. శ్మశానాల ఆధునీకరణతో ప్రశాంతమైన వాతావరణంలో దహనక్రియలు, కర్మక్రియలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీష తెలిపారు. అనంతరం వారు రూ.1.25 కోట్లతో కరకంబాడి రోడ్డులో కపిలతీర్థం కాలువపై ఉపవంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఇదీ చదవండి: