తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇప్పటివరకు కొవిడ్ కేర్ కేంద్రాలుగా వసతిగృహాలు వినియోగించామన్నారు. విష్ణునివాసం, శ్రీనివాసం సత్రాలను మళ్లీ తితిదేకు అప్పగిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. మాధవం, గోవిందరాజస్వామి సత్రాలను తితిదేకు అప్పగిస్తామని వెల్లడించారు. తిరుపతిలో రుయా, స్విమ్స్ ఆస్పత్రులలో, చిత్తూరు అపోలో, కుప్పం పీఈఎస్ ఆస్పత్రుల్లో కొవిడ్ వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ