తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్, ఐపీఎస్ అధికారి ఎబీ.వెంకటేశ్వరరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: వకుళామాత ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి