ఉత్తరాంధ్రపై ఉన్న అక్కసును వెళ్లగక్కడానికే.... తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయమన్న ఆయన... అసెంబ్లీలో తీర్మానంతోనే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. చంద్రబాబు చేయమంటేనే రాజధాని రైతులు పోరాటం చేస్తున్నారని... ఆయన ఆపమంటేనే వారు ఆందోళనలు మానేస్తారన్నారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని అధికారులను ఆదేశించినట్లు బొత్స స్పష్టం చేశారు.
'చంద్రబాబు చేయమంటేనే రాజధాని రైతులు పోరాటం చేస్తున్నారు' - మంత్రి బొత్స సత్యనారాయణ లేటెస్ట్ వార్తలు
పాలనా వికేంద్రీకరణకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారుని మంత్రి బొత్స ప్రశ్నించారు. విశాఖను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని పునరుద్ఘాటించారు. ఉత్తరాంధ్రపై ఉన్న అక్కసును వెళ్లగక్కడానికే తెదేపా అధినేత విశాఖ పర్యటనకు వెళ్లారని బొత్స ఆరోపించారు.
ఉత్తరాంధ్రపై ఉన్న అక్కసును వెళ్లగక్కడానికే.... తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయమన్న ఆయన... అసెంబ్లీలో తీర్మానంతోనే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. చంద్రబాబు చేయమంటేనే రాజధాని రైతులు పోరాటం చేస్తున్నారని... ఆయన ఆపమంటేనే వారు ఆందోళనలు మానేస్తారన్నారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని అధికారులను ఆదేశించినట్లు బొత్స స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:
'అనుమతి ఇచ్చి అడ్డుకోవడం వైకాపా కుట్రలో భాగమే'