శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సె తిరుమల శ్రీవారిని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సె దర్శించుకున్నారు. ఈ ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న రాజపక్సెకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.