ETV Bharat / city

తిరుమలలో ప్రారంభమైన లయన్​ సఫారీ.. ఆనందోత్సాహంలో సందర్శకులు - venkateshwara zoological park in tirupathi news

అన్​లాక్​ తర్వాత సందర్శన ప్రదేశాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నాయి. దీంతో అందమైన ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా కారణంగా ఇళ్లల్లోనే ఉండిపోయిన ప్రజలు సేదతీరేందుకు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వైరస్​ పరిస్థితుల అనంతరం ప్రారంభమైన తిరుపతి జంతుప్రదర్శనశాలలో పర్యాటకుల సందడిపై ప్రత్యేక కథనం...

zoological park
జంతుప్రదర్శనశాల
author img

By

Published : Jan 9, 2021, 7:03 PM IST

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు.. విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తొమ్మిది నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. కరోనా తర్వాత ప్రారంభమైన జంతుప్రదర్శనశాల సందర్శకులను అలరిస్తోంది. కరోనాతో నెలల తరబడి ఇంటికే పరిమితమైన ప్రజలు కొంతవరకు సాధారణ పరిస్థితి నెలకొనడంతో బయటకు వస్తున్నారు. పక్షులు, జంతువులు, సరీసృపాలు ఇలా దాదాపు పదకొండు వందల వరకు విభిన్న జీవ జాతులను చూస్తూ సేదతీరుతున్నారు.

సహజ సిద్ధమైన, విశాలమైన అడవి అందాల మధ్య సంచరిస్తున్న జంతువులను తిలకిస్తూ పర్యాటకులు మధురానుభూతులకు లోనవుతున్నారు. మూడు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న దాదాపు 30 రకాల పక్షి జాతులతో పాటు వివిధ జంతువులను వీక్షిస్తూ పర్యాటకులు ఆనందిస్తున్నారు. కరోనాకు ముందు రోజుకు మూడు వేల మందికి పైగా పర్యాటకులు వచ్చేవారు. ఇప్పుడు సుమారు రెండు వేల సందర్శకులు ప్రదర్శనశాలకు వస్తున్నారని అధికారులు తెలిపారు.

"కరోనా కారణంగా సందర్శకులను పరిమితం చేశాం. కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ వాహనాల్లో తొమ్మిది నుంచి పదిమంది వరకే అనుమతిస్తున్నాం. జంతుప్రదర్శనశాలలోకి వచ్చే వాహనాలను శానిటైజ్​ చేయిస్తున్నాం. ఈ నెల మొదటి నుంచి లయన్​ సఫారీ ప్రారంభం కావటంతో సందర్శకులు కూడా పెరిగారు" - హిమశైలజ, తిరుపతి జూ క్యూరేటర్‌

ప్రత్యేక ఆకర్షణగా సఫారీ పార్కు:

తిరుపతి జూలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సింహాల సఫారీ, తెల్లపులుల ప్రాంతానికి సందర్శకులను అనుమతిస్తున్నారు. ఇటీవలే లయన్‌ సఫారీకి పర్యాటకులకు ప్రవేశం కల్పించారు. బోన్లలో బంధించిన వాటిని కాకుండా స్వేచ్ఛగా అటవీ ప్రాంతంలో సంచరించే జంతువులను వీక్షించే అవకాశం కల్పించారు. సింహాలు, తెల్ల పులులు గాండ్రిస్తూ స్వేచ్ఛగా తమ కళ్లముందే తిరుగుతున్న వాటిని చూస్తూ సంతోషిస్తున్నారు.

"చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వచ్చి.. జంతుప్రదర్శనశాలను సందర్శించటం ఆనందంగా ఉంది. సింహాలను చాలా దగ్గరగా చూశాం. తెల్ల పులులను చూడటం ఇదే మొదటిసారి.. ఈ అనుభూతి ఎప్పటికీ మరచిపోలేను. లయన్​ సఫారీ చాలా బాగుంది. అన్నీ రకాలు జాగ్రత్తలు తీసుకుంటుండటంతో పిల్లలతో సందర్శనకు రావటానికి భయపడాల్సిన పనిలేదు" -సందర్శకురాలు

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల

ఇదీ చదవండి: పది నెలల తర్వాత దుకాణాలు తెరిచారు... తీరా చూస్తే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.