ETV Bharat / city

అప్పుడే రాజధానిపై కేంద్రం మాట్లాడుతుంది: కిషన్​రెడ్డి - రాజధానిపై కిషన్​రెడ్డి వ్యాఖ్యలు

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు ఈ విషయంలో కేంద్రం స్పందించదని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. అధికారిక నివేదిక వచ్చిన తరువాతే కేంద్రం తన వైఖరేంటే చెబుతుందని వెల్లడించారు.

kishan reddy respond on ap capital issue
కిషన్ రెడ్డి
author img

By

Published : Jan 5, 2020, 11:34 PM IST

మీడియాతో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తిరుపతిలో భాజపా నిర్వహించిన కేంద్ర పౌరసత్వ సవరణ చట్టం- 2019 అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్​ల నుంచి ప్రాణ భయంతో మన దేశంలో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న ఆ దేశాల మైనార్టీలను ఆదుకోవటమే ధ్యేయంగా సీఏఏ తీసుకువచ్చినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై స్పందించిన కిషన్ రెడ్డి.... మంత్రులు నోటి మాటలుగా చెబుతోన్న అభిప్రాయాలపై కేంద్రం స్పందించదన్నారు. నాటి పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధి కోసం ప్రధాని మోదీ మాటిచ్చారన్న ఆయన.....రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక నివేదిక తర్వాత కేంద్రం తన అభిప్రాయాన్ని చెబుతుందన్నారు. ఇప్పటికే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇదీ చదవండి:కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కాళ్లు మెుక్కిన రాజధాని రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.