చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ భగవాన్ రామతీర్ధ సేవాశ్రమంలో హత్యకు గురైన అచ్యుతానందగిరి స్వామి పార్ధీవదేహానికి కాకినాడ, భీమిలి పీఠాధిపతులు నివాళులు అర్పించారు. హత్యకు గల కారణాలను కుటుంబసభ్యులు, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. స్వామీజీని చంపడం చాలా బాధాకరమని కాకినాడ, భీమిలి పీఠాధిపతులు అన్నారు. ఈ కేసును పోలీసులు త్వరగా ఛేదించాలని కోరారు. దేవాలయాలు, ఆశ్రమాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా.. చూడాలని కోరారు.
అచ్యుతానంద స్వామికి నివాళులర్పించిన కాకినాడ, భీమిలి పీఠాధిపతులు - achuthananda swamy latest updates
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ భగవాన్ రామతీర్ధ సేవాశ్రమంలో అచ్యుతానంద స్వామిని చంపడం చాలా బాధాకరమని... కాకినాడ, భీమిలి పీఠాధిపతులు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్యుతానందగిరి స్వామి పార్ధీవదేహానికి నివాళులు అర్పించారు.