కనుమ పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కాకబలి నిర్వహించారు. వేకువజామున 3 గంటలకే తోమాలసేవ నిర్వహించి, ఆ తర్వాత శాస్త్రోక్తంగా కాకబలి పూర్తిచేశారు. ఇందురో భాగంగా.. వేర్వేరుగా పసుపు, కుంకుమ కలిపిన అన్నాన్ని మంగళ వాయిద్యాల నడుమ ఆనంద నిలయం విమాన వేంకటేశ్వర స్వామివారికి నివేదించారు. ఏటా కనుమ రోజున విమాన వేంకటేశ్వరుడికి కాకబలి నిర్వహించడం ఆనవాయితీ.
ఇక మహా భక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవాన్ని పురస్కరించుకొని.. శ్రీవారి మూలవిరాట్‌కు గోదా మాలలు సమర్పించారు. తిరుపతి గోవిందరాజ ఆలయంలోని శ్రీ గోదాదేవి చెంత నుంచి పెద్దజీయర్ మఠానికి తెచ్చిన పూలమాలలను.. తిరుమాఢ వీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తిరుమలేశుని మూలవిరాట్టుకు అలంకరించారు.
ఇదీ చదవండి: GOVERNOR TAMILISAI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్