ETV Bharat / city

మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాలి: జస్టిస్ ఎన్.వి.రమణ - జస్టిస్ ఎన్​వి రమణ తాజా వార్తలు

మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మాతృభాష..జాతి ఔన్నత్యానికి ప్రతీక అని అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాల అష్టావధానాన్ని ప్రారంభించిన ఆయన.. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురాభిమాని కాదన్నారు.

మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాలి
justice nv ramana
author img

By

Published : Jul 18, 2021, 3:07 PM IST

Updated : Jul 18, 2021, 3:53 PM IST

మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. తిరుపతిలో అవధాని మేడసాని మోహన్ ఆధ్వర్యంలో అంతర్జాలం ద్వారా చతుర్గుణిత అష్టావధానం నిర్వహిస్తుండగా..ఎన్​.వి.రమణ తొలి ప్రశ్న వేసి అష్టావధానాన్ని ప్రారంభించారు. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు ప్రత్యేకమని ఎన్.వి.రమణ అన్నారు. శతాబ్దాల సాహితీ తపస్సు నుంచి అవధానం ఉద్భవించిందన్నారు. జ్ఞాపకశక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అవధానమని వ్యాఖ్యానించారు. మాతృభాష..జాతి ఔన్నత్యానికి ప్రతీక అని అభిప్రాయపడ్డారు. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురాభిమాని కాదన్నారు.

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జీవన గమనాన్ని మారుస్తోంది. తెలుగు భాషకు ఆదరణ తగ్గించడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. సాహితీ ప్రక్రియను జనరంజకంగా తీర్చిదిద్దాలి. సాహిత్య రూపం కనుమరుగైతే తిరిగి సృష్టించలేం. సాహితీ ప్రక్రియ ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టేలా మార్పు చేసుకోవాలి. సాహితీ సేవలో నా వంతు కృషి చేయడానికి ముందుంటా. -భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ

ఇదీ చదవండి

అఖిల పక్ష సమావేశం- ప్రధాని హాజరు

Last Updated : Jul 18, 2021, 3:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.