రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి సమర్పించిన నివేదిక (AP GOVERNMENT FLOOD REPORT) హాస్యాస్పదంగా ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డివి కాకి లెక్కలు, హెలికాప్టర్ లెక్కలని ఎద్దేవా(NADENDLA MANOHAR SERIOUS ON CM JAGAN FLOODS REPORT) చేశారు.
వైకాపాది దాటవేత ధోరణి..
వైకాపా నాయకులు వరద బాధితులకు ధైర్యమివ్వకపోగా.. వరద నష్టంపైనా సరైన లెక్కలు ఇవ్వట్లేదని మనోహర్ మండిపడ్డారు. శాసనసభ సమావేశాలు ఎందుకు పొడిగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్ వర్క్ ఫ్రం హోం (CM YS JAGAN WORK FROM HOME)మానేసి ప్రజల మధ్యలో తిరగాలని సూచించారు. అధికారులు చెప్పిన లెక్కలు విని పరిపాలిస్తే జగన్ భవిష్యత్లో నష్టపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ 68 ఏళ్ల వయస్సులో గొడుగు పట్టుకుని ప్రజల మధ్య తిరుగుతుంటే.. 48 ఏళ్ల జగన్ ఇంట్లో కూర్చుని పరిపాలిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లను ఇసుక మాఫియా కోసమే ఎత్తలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ కు పరిపాలనా దక్షత లేదని.. సమస్యలపై వైకాపాది దాటవేత ధోరణి తప్ప, ప్రజలకు సాయం చేయాలనే ఆలోచన, చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి:
Chandrababu on Floods: ప్రాజెక్టులు తెగిపోయే వరకు అధికారులు ఏం చేస్తున్నారు?