ఆస్తుల విలువ ఆధారంగా పన్నులు విధించటం సరికాదని... తెదేపా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో మరింత భారం మోపుతోందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 15 శాతానికి మించి పన్నులు వేయబోమని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి... ఇప్పుడు అదనంగా 10నుంచి 22శాతం వరకూ పన్నులను వడ్డిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని గౌనివారి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... గర్భిణికి తప్పని పాట్లు.. డోలీలో 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్థులు