తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహణలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాలలు ఐఎస్‌వో (ISO) గుర్తింపు పత్రాలు పొందాయి. ఈ మేరకు ఐఎస్‌వో ప్రతినిధులు తితిదే ఈవో జవహర్‌రెడ్డికి సంబంధిత ధ్రువపత్రాలు అందజేశారు.
కళాశాలల్లో డాక్యుమెంట్ల నిర్వహణ, ఉత్తమ మౌలిక సదుపాయాలు, ఉత్తమ విద్యా ప్రమాణాల నిర్వహణకు సంబంధించి ఐఎస్‌వో-9001 సాధించాయి. కళాశాలల్లో పచ్చదనం పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి ఐఎస్‌వో-14001 సర్టిఫికెట్‌ను కళాశాలలు దక్కించుకున్నాయి. కళాశాలల కార్యాలయాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్ భవనాల్లో విద్యుత్ పొదుపునకు సంబంధించి ఐఎస్‌వో-50001 సర్టిఫికెట్‌ను పొందాయి.
తితిదే కళాశాలల్లో శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, కరోనా నిబంధనల అమలు మెరుగ్గా ఉన్నాయని ఐఎస్‌వో సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆలపాటి శివయ్య, డైరెక్టర్ మౌళిక అభినందించారు. ఐఎస్‌వో గుర్తింపు పొందటానికి కృషి చేసిన జేఈవో సదా భార్గవి, తితిదే విద్యాశాఖాధికారి గోవిందరాజన్, కళాశాలల సిబ్బందిని ఈవో అభినందించారు.
ఇదీ చదవండి