తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు 20 లక్షల విరాళం అందింది. ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్, ఎండీ పద్మజా చుండూరు రూ.20 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆమె.. ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళాలకు సంబంధించిన డీడీలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
ఇదీ చదవండి: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ మహోత్సవం..పాల్గొన్న తితిదే ఛైర్మన్ సతీమణి