ETV Bharat / city

తిరుమలలో భారీగా రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే? - తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ వార్తలు

TTD: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. అదివారం రాత్రి వరకు ఈ రద్దీ కొనసాగే ఆవకాశం ఉందని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
author img

By

Published : Jun 11, 2022, 10:25 PM IST

Updated : Jun 12, 2022, 3:06 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్‌ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. క్యూలైన్‌లోని భక్తుల దర్శనానికి 2 రోజుల సమయం పడుతుందన్నారు. భక్తులకు అల్పాహారం, నీరు, పాలు అందిస్తున్నామని తెలిపారు. రేపు రాత్రి వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు ఈవో స్పష్టం చేశారు.

దళారి మోసం: ప్రత్యేక ప్రవేశ దర్శనం పేరుతో ఓ దళారి ఎనిమిది మంది భక్తులను మోసం చేశారు. పాత టికెట్లతో భక్తులు దర్శనానికి వెళ్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. విచారణ చేపట్టిన విజిలెన్స్ సిబ్బంది.. దళారి రాజు భక్తులకు టికెట్లను అంటగట్టినట్లు తేలింది. పొరుగు సేవల సిబ్బంది వెంకటేశ్​తో కలిసి రాజు అక్రమాలకు పాల్పడ్డారు. దళారికి సహకరించిన వెంకటేశ్​పై శాఖపరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అదివారం రాత్రి వరకు రద్దీ కొనసాగే ఆవకాశం

TTD EV on Rush in Tirumala: తిరుమలలో భక్తుల అనూహ్యంగా పెరిగిందని, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు వలే కొండపై భక్తులు కనిపిస్తున్నారని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. తితిదే అన్ని విభాగాల అధికారులతో కలిసి ఆయన క్యూ లైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్యూ లైనులో వేచి ఉండే భక్తులకు రెండు రోజుల సమయం పడుతుందన్నారు. రద్దీ సమయంలో కూడా భక్తులకు అన్ని సౌకర్యాలను తితిదే యంత్రాంగం కల్పిస్తుందని చెప్పారు. క్యూ లైన్​లో వెళ్లే భక్తులకు అల్పాహారం, నీరు,పాలు అందిస్తున్నామని.. భక్తులకు ఏదైనా అసౌకర్యం కలిగితే మనించాలని ఆయన కోరారు. అదివారం రాత్రి వరకు ఈ రద్దీ కొనసాగే ఆవకాశం ఉందని ఈవో తెలిపారు.

ఇవీ చూడండి :

Last Updated : Jun 12, 2022, 3:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.