తితిదే ఆలయాల్లో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలకు ఉపయోగించిన పూలతో పరమళభరితమైన అగరబత్తీలు తయారు చేస్తున్నారు. సప్తగిరులకు సూచికగా అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, దివ్యసృష్టి, దివ్యదృష్టి లాంటి ఏడు బ్రాండ్ల అగరబత్తీలు రూపొందించింది. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి.. తిరుపతి శ్రీవెంకటేశ్వర గోశాలలో రోజుకు మూడున్నర లక్షల అగరబత్తీలను ఉత్పత్తి చేస్తున్నారు.
పూలను వ్యర్థంగా పారేయకుండా
కైంకర్యాలకు ఉపయోగించిన పూలను వ్యర్థంగా పారేయకుండా, మళ్లీ స్వామివారి పూజలకు ఉపయోగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో.. అగరబత్తీల తయారీ చేపట్టినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
లడ్డూ కౌంటర్ల వద్ద అందుబాటులోకి
ఏడు బ్రాండ్ల అగరబత్తీలను తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులకు అందుబాటులో ఉంచారు. స్వామివారి పూజకు వినియోగించిన పూలతో అగరొత్తులు తయారు చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ.83 లక్షలతో యంత్ర సామగ్రి
పుష్పాలతో అగరబత్తీల తయారీ తరహాలోనే.. ఎండుపూల సాంకేతికతతో దేవుడి పటాలు, కీచైన్‌లు తదితర వస్తువుల తయారీకి తితిదే ప్రణాళికలు రూపొందించింది. ఈమేరకు ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్న తితిదే.. రూ.83 లక్షలతో యంత్రసామగ్రి కొనుగోలు చేయనుంది. దీనిపై తిరుపతి నిమ్మ పరిశోధన క్షేత్రంలో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. స్వామివారి ఫోటోలతో పాటు, క్యాలెండర్లు, కీచైన్లు, పేపర్ వెయిట్లు, రాఖీలు తయారు చేయనుంది.
ఇదీ చదవండి: